: పార్టీకి చెందిన అన్ని కమిటీలను రద్దు చేసిన మాయావతి
మోడీ దెబ్బకు ఉత్తరప్రదేశ్ లో అన్ని ప్రధాన పార్టీలు మట్టి కరిచాయి. దీంతో అన్ని పార్టీల వారు సమీక్ష ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బీఎస్సీ అధినేత్రి మయావతి తన పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలను రద్దు చేశారు. లక్నోలోని పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమైన మాయావతి ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ స్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేసేశారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్సీ ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది.