: భావోద్వేగానికి లోనై కంటతడిపెట్టిన మోడీ


బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. భరతమాతకు సేవ చేసే భాగ్యం ఆ దేవుడు, బీజేపీ ఇచ్చిన వరమని ఆయన చెమ్మగిల్లిన కళ్లతో చెప్పారు. బీజేపీ దయవల్లే భరతమాతకు సేవ చేసే అవకాశం దక్కిందని ఆయన అన్నారు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వారి తరహాలో పాలన సాగించాయని, ముందు ప్రభుత్వాల పాలనలోని మంచిని స్వీకరిస్తామని మోడీ చెప్పారు. బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం ఇచ్చారంటే, అది తమ పార్టీ మీద ఉన్న నమ్మకమేనని ఆయన చెప్పారు. తమ ఆకాంక్షలు, కలలు నెరవేరుస్తామన్న ఆశలను ప్రజలు బీజేపీపై పెట్టుకున్నారన్నారు. మార్పు కోసం యావత్ భారతదేశం కదిలిందని మోడీ అన్నారు. ప్రతి క్షణం, శరీరంలోని ప్రతి కణం దేశం కోసం పరితపిస్తోందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News