: అద్వానీకి పాదాభివందనం చేసిన మోడీ
బీజేపీ పార్లమెంటరీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన మోడీ తన వినయ విధేయతలను, సంస్కారాన్ని మరోసారి చాటుకున్నారు. పార్లమెంటరీ నేతగా ఎన్నికైన మోడీని అద్వానీ పుష్పగుచ్చంతో అభినందించారు. వెంటనే అద్వానీకి మోడీ పాదాభివందనం చేసి పెద్దల పట్ల తనకున్న విధేయతను ప్రదర్శించారు. అనంతరం మోడీని అద్వానీ గుండెలకు హత్తుకున్నారు.