: తిరుమలలో మందుబాబుల వీరంగం


పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో మందుబాబులు నిన్న రాత్రి రభస చేశారు. వరాహస్వామి గెస్ట్ హౌస్ లోని దుకాణాల వద్ద ఓ యువకుడిపై సోమవారం అర్ధరాత్రి దాడి చేశారు. అక్కడికి దగ్గర్లో ఉన్న దుకాణదారులపై కూడా వారు చేయి చేసుకున్నారు. వీరి దాడిలో కొందరు గాయపడ్డారని తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News