: ముగ్గురు మంత్రులపై జయ వేటు
లోక్ సభ ఎన్నికల్లో సరిగా పని చేయలేదంటూ మంత్రివర్గంలోని ముగ్గురు మంత్రులపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వేటు వేశారు. ఈ మేరకు ఆ రాష్ట్ర రాజ్ భవన్ నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. వారి స్థానంలో ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ విజయానికి కృషి చేసిన వారికి చోటు కల్పించారు. అటు ఆరుగురు జిల్లా నేతలపైన కూడా జయ కఠిన చర్యలు తీసుకున్నారు. తమిళనాడులో మొత్తం 39 లోక్ సభ సీట్లు ఉండగా 2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో 37 స్థానాలు గెలుచుకుని జయ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.