: శ్రీవారిని దర్శించుకున్న గంటా, కోడెల, దానం
ఈ రోజు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని పలువురు రాజకీయవేత్తలు దర్శించుకున్నారు. వీరిలో భీమిలి ఎమ్మెల్యేగా ఎన్నికైన గంటా శ్రీనివాసరావు, సత్తెనపల్లి నుంచి గెలిచిన కోడెల శివప్రసాద్, తిరుపతి నుంచి ఎన్నికైన వెంకటరమణ ఉన్నారు. వీరితో పాటు ఎన్నికల్లో ఓటమిపాలైన మాజీ మంత్రి దానం నాగేందర్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం గంటా మాట్లాడుతూ, ఎన్నికల్లో ఓటర్లు మంచి తీర్పును ఇచ్చారని... అభివృద్ధి చేయాలనే విజన్ గల నాయకుడికి పట్టం కట్టారని కొనియాడారు. ఇదే సమయంలో వైకాపా అధినేత జగన్ పై ఆయన మండిపడ్డారు. ప్రజల తీర్పును గౌరవించకుండా జగన్ పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని విమర్శించారు. తనకు పదవి ముఖ్యంకాదని... ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని గంటా అన్నారు.