: లండన్ లో టీడీపీ, బీజేపీ అభిమానుల విజయోత్సవాలు
కేంద్రంలో బీజేపీ, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ విజయం సాధించడంతో ఆయా పార్టీలకు చెందిన అభిమానులు లండన్ లో ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఇంగ్లండ్ లోని ఎన్ఆర్ఐ గ్రూప్ దేశీ ప్లేవా పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశాన్ని నరేంద్ర మోడీ, ఆంధ్ర ప్రదేశ్ ను చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపిస్తారని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.