: ఈసెట్ ఫలితాలు విడుదల
ఈసెట్ 2014 పరీక్ష ఫలితాలను ఇవాళ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి విడుదల చేశారు. కాకినాడ జేఎన్టీయూలో ఫలితాల విడుదల అనంతరం ఆయన మాట్లాడుతూ... ఈ ఏడాది 88.23 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. మొత్తం 39,106 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకాగా, 34,505 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను www.apecet.org వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.