: రెండ్రోజుల ముందే భారత ఉపఖండంలోకి ప్రవేశించిన రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు అత్యంత వేగంతా విస్తరిస్తున్నాయి. రెండు రోజుల ముందే భారత ఉపఖండంలోకి ప్రవేశించాయి. దీని ప్రభావంతో అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. మన రాష్ట్రంలోకి జూన్ రెండో వారంలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి. తొలుత రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో రుతుపవనాల ప్రభావం ఉంటుంది. మరో విషయం ఏమిటంటే, చత్తీస్ గఢ్ నుంచి కేరళ వరకు అల్పపీడన ద్రోణి ఆవరించింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.