: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్న తరుణ్ గొగోయ్


సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ మరో వారం రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు అసోం సీఎం తరుణ్ గొగోయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఇవాళ గౌహతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ ఉదాసీన వైఖరి వల్లే రాష్ట్రంలో తమకు పేలవ ఫలితాలు వచ్చాయని అన్నారు.

అసోంలో మొత్తం 14 పార్లమెంటు స్థానాలకు గాను మూడు చోట్ల తమ పార్టీ గెలిచిందని తరుణ్ గొగోయ్ చెప్పారు. పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహించి వారం రోజుల్లో పదవికి రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. అయితే రాజకీయాల నుంచి మాత్రం వైదొలగడం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న గడ్డు పరిస్థితుల నుంచి పార్టీని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News