: ప్రజా తీర్పును గౌరవిస్తాం: వైఎస్సార్సీపీ నేత వంగవీటి రాధాకృష్ణ
ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తామని విజయవాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ అన్నారు. చంద్రబాబు ఇచ్చిన తప్పుడు వాగ్దానాల వల్లే తాము ఓటమిని చవిచూశామని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలను మోసం చేయకుండా నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పాత్రలో ఉండి ప్రజాసమస్యలపై పోరాడుతామని వంగవీటి రాధాకృష్ణ చెప్పారు.