: గార్డెన్ సిటీలో 'గేల్' దుమారం
ముంబయి ఇండియన్స్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విధ్వంసక బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ విరుచుకుపడ్డాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మొండి పట్టుదల ప్రదర్శించిన గేల్ 92 పరుగులతో అజేయంగా నిలిచాడు. గేల్ మొత్తం 58 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. మరోవైపు గేల్ కు చక్కని సహకారం అందించిన అరుణ్ కార్తీక్ 19 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. దీంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది.