: తాగుబో'తోడు' వద్దంటూ పీటల మీద నుంచి లేచిపోయిన వధువు


తాగుబోతు వరుడు తనకు వద్దంటూ ఓ యువతి పెళ్లి పీటల మీద నుంచి లేచిపోయిన ఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో జరిగింది. పెళ్లి తంతు జరుగుతోంది. వరుడు మాత్రం తడబడుతున్నాడు. పంతులుగారు చెప్పినవి చేస్తూ తూలిపోతున్నాడు. తాగొచ్చాడని గుర్తించిన వధువు, ఈ పెళ్లి తనకు వద్దంటూ లేచి వెళ్లిపోయింది. ఆమె నిర్ణయాన్ని అందరూ అభినందిస్తున్నారు. ఆ యువతి తండ్రి తాగుడు వ్యసనం వల్లే అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు. అందుకే తాగుడు అలవాటున్న వరుడిని చేసుకోవడం ఆమెకు ఇష్టం లేదని సంబంధీకులు తెలిపారు.

  • Loading...

More Telugu News