: సమాచార కమిషనర్ల నియామకంపై హై కోర్టులో పిల్
సమాచార కమిషనర్ల నియామకాన్ని సవాలు చేస్తూ హై కోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు అయింది. దీనిని కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య దాఖలు చేసారు. ప్రభుత్వం రాజకీయ నేపథ్యం ఉన్నవారిని ఎంపిక చేసిందని, తొలుత వీరి పేర్లను గవర్నర్ తిరస్కరించారని పేర్కొన్నారు. అయినా సరే తిరిగి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారినే సమాచార కమిషనర్లుగా ప్రభుత్వం ఎంపిక చేసిందని కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై సోమవారం విచారణ జరుగుతుంది.