: మోడీ అభినందనపై పవన్ స్పందన
సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో సీమాంధ్ర పర్యటనలో తనకు సహకరించిన పవన్ కల్యాణ్ కు ఈ ఉదయం నరేంద్రమోడీ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై కొద్దిసేపటి కిందట పవన్ స్పందిస్తూ, తనను గుర్తుంచుకుని ప్రశంసించడం మోడీ గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధివైపు మోడీ నడిపిస్తారని బలంగా నమ్ముతున్నానని తెలిపారు.