: వాజ్ పేయి రికార్డు బద్దలు కొట్టిన రాజ్ నాథ్ సింగ్


బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ సార్వత్రిక ఎన్నికల్లో లక్నో నుంచి భారీ మెజారిటీతో నెగ్గిన ఎంపీగా రికార్డు సృష్టించారు. 2004 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన మాజీ ప్రధాని వాజ్ పేయి 2.18 లక్షల మెజారిటీతో విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఆ రికార్డును రాజ్ నాథ్ సింగ్ బద్దలుకొట్టారు. లక్నో నుంచి ఎంపీగా పోటీ చేసిన రాజ్ నాథ్ సింగ్ 2.72 లక్షల మెజారిటీ సాధించారు. కాగా ఓట్ల శాతంలో వాజ్ పేయితో రాజ్ నాథ్ సింగ్ పోటీ పడలేకపోయారు. అప్పట్లో వాజ్ పేయికి 57.82 శాతం ఓటర్లు ఓట్లు వేయగా, రాజ్ నాథ్ సింగ్ కు 55.7 శాతం ఓటర్లు మాత్రమే ఓటేశారు.

  • Loading...

More Telugu News