: మోడీ ధాటికి నితీష్, లాలూ విలవిల


సార్వత్రిక ఎన్నికల్లో పలు రాష్ట్రాలను బీజేపీ స్వీప్ చేస్తే... ఇంకొన్ని రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ దెబ్బకు ఆయా ప్రాంతాల బడా నేతలు మట్టికరిచారు. ప్రధానంగా బీహార్ లో మోడీ హవాతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ జేడీయూ, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీలు కుదేలయ్యాయి. లాలూ, నితీష్ ల ప్రభావం ఎక్కడా పనిచేయలేదు. ఏడాదిన్నర కిందట ఎన్డీఏ కూటమి నుంచి బయటికొచ్చిన జేడీయూ ఈ ఫలితాల్లో రెండు స్థానాలతోనే సరిపెట్టుకుంది. చివరికి ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్ సైతం ఓడిపోయారు.

ఇక లాలూ కుటుంబం నుంచి ఆయన భార్య రబ్రీదేవీ, కుమార్తె మీసా భారతి పోటీ చేశారు. సరన్ లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగిన రబ్రీ బీజేపీ అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ రూడీ చేతిలో ఓడితే, కుమార్తె పాటలీపుత్ర స్థానం నుంచి పొటీ చేసి కమలం అభ్యర్థి రామ్ కృపాల్ యాదవ్ చేతిలో ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్నారు.

మొత్తం బీహార్ లో 40 లోక్ సభ స్థానాలుంటే బీజేపీ 31 సీట్లు కైవసం చేసుకుంది. ఇందులో బీజేపీ సొంతంగా 22 స్థానాలు గెలుచుకోగా, దాని మిత్ర పక్షాలైన రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ ఆరు, రాష్ట్రీయ లోక సమతా పార్టీ (ఆర్ఎల్ ఎన్ పీ) మూడు సీట్లు గెలుపొందాయి.

  • Loading...

More Telugu News