: ఫరూఖ్ అబ్దుల్లా ఓటమి
కేంద్రమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా ఓటమిపాలయ్యారు. జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన ఫరూఖ్ అబ్దుల్లా, తన సమీప ప్రత్యర్థి, పీడీపీ అభ్యర్థి తారిఖ్ హమీద్ ఖర్ చేతిలో ఓటమి చవి చూశారు. ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాగా, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన ఫరూక్ అబ్దుల్లా యూపీఏలో భాగస్వామిగా ఉన్నారు.