: బీజేపీపై నమ్మకముంచి నన్ను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు: మోడీ


బీజేపీపై నమ్మకముంచి తనను గెలిపించిన వడోదర, వారణాసి ప్రజలకు ధన్యవాదాలు అని కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. వడోదరలో ఆయన మాట్లాడుతూ, నేటి నుంచి మన కష్టాలకు ముగింపు పలుకుదామని అన్నారు. బీజేపీపై నమ్మకముంచిన దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం అంటే ఏమిటో ప్రపంచానికి చూపించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. బీజేపీ విజయానికి కృషి చేసిన భాగస్వాములందరికీ ధన్యవాదాలు అన్నారు.

  • Loading...

More Telugu News