: అతి పెద్ద ప్రజాస్వామ్యానికి నాయకత్వం వహించనున్న మోడీకి అభినందనలు: బ్రిటన్ ప్రధాని
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకత్వం వహించే అవకాశం సొంతం చేసుకున్న మోడీకి అభినందనలు అంటూ బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమెరాన్ తెలిపారు. నరేంద్ర మోడీ విజయం సాధించడాన్ని ఆయన శ్లాఘించారు. భారత్, బ్రిటన్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయని, మోడీ నాయకత్వంలోని ప్రభుత్వంతో తమ సత్సంబంధాలు కొనసాగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గోద్రా అల్లర్ల అనంతరం మోడీపై బ్రిటన్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.