: ప్రత్యర్థుల చేతిలో ఓడిపోయాం...గెలుపోటములు సహజం: సోనియా గాంధీ


ప్రత్యర్థుల చేతిలో తాము ఓటమిపాలయ్యామని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించారు. ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, గెలుపోటములు సహజమని, అవి వస్తూ పోతూ ఉంటాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఓటమికి బాధ్యత వహిస్తున్నానని సోనియా గాంధీ తెలిపారు. బీజేపీకి శుభాకాంక్షలు అని, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో బీజేపీ చిత్తశుద్ధితో పని చేస్తుందని ఆశిస్తున్నానని ఆమె అన్నారు. ప్రతిపక్ష పార్టీగా తమ పూర్తి సహకారం బీజేపీకి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News