: మోడీకి ప్రధాని మన్మోహన్ శుభాకాంక్షలు
కాబోయే ప్రధాని నరేంద్రమోడీకి పదవి నుంచి వైదొలగుతున్న ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోన్ లో శుభాకాంక్షలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంపై ఆయనను అభినందించినట్లు ప్రధాని కార్యాలయం ట్విట్టర్ లో తెలిపింది. ఇదిలా ఉంటే రేపు ఉదయం జాతినుద్దేశించి మన్మోహన్ ప్రసంగించనున్నారు. అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసి తన రాజీనామాను సమర్పిస్తారు.