: ఆత్మాభిమానాన్ని తెలుగు ప్రజలు గెలిపించారు: బాలకృష్ణ
తెలుగు ప్రజలు ఆత్మాభిమానాన్ని గెలిపించారని టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ తెలిపారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీపై విశ్వాసముంచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆత్మగౌరవం అంటూ టీడీపీ ఎత్తుకున్న నినాదంపై ప్రజలకు నమ్మకం కలిగిందని అన్నారు. తాము ఏ హామీలైతే ఇచ్చామో వాటన్నింటినీ అమలు చేస్తామని బాలయ్య తెలిపారు.