: ఎంత గొప్పవాడివయ్యా బరాక్ ఒబామా!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన దాతృత్వాన్ని చాటుకున్నారు (ఘనంగా మాత్రం కాదు). ఆయన తన వార్షిక వేతనం నుంచి సుమారు ఐదు శాతం జీతాన్ని అమెరికా ట్రెజరీ శాఖకు విరాళంగా ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలో ఆర్ధిక ఆంక్షలు, నిధుల్లో కోతలు విధిస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడి హార్ధిక చర్యను పలువురు స్వాగతిస్తున్నారు.
కాగా, ఒబామాకు అధ్యక్ష వేతనం కింద సంవత్సరానికి రూ. 2 కోట్లకు పైగా చెల్లిస్తారు. దాంట్లో ఐదు శాతం.. అంటే, రూ. 10 లక్షలను ఆయన ట్రెజరీకి అందించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఆర్ధిక ఆంక్షలతో సహవాసం చేస్తూ కూడా, భారీ వేతనాలు ఆశించకుండా, విధుల్లో కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగుల త్యాగంలో తానూ భాగం పంచుకోవాలన్న భావనతోనే ఒబామా విరాళం ప్రకటించారని వైట్ హౌస్ ప్రెస్ వ్యవహారాల కార్యదర్శి జే కార్నీ వెల్లడించారు.