: సంగారెడ్డి న్యాయస్థానంలో హాజరవుతున్న అక్బరుద్దీన్
కలెక్టరును దూషించిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఎంఐఎం శాసన సభ్యుడు అక్బరుద్దీన్ ను ఈ రోజు సంగారెడ్డి కోర్టులో పోలీసులు హాజరపరుస్తున్నారు. ఇందుకోసం ఉదయం 7 గంటలకే ఆయనను ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి సంగారెడ్డి న్యాయస్థానానికి పోలీసులు తరలించారు. అక్కడ విచారణ అనంతరం తిరిగి ఆదిలాబాద్ కారాగారానికి అక్బరుద్దీన్ ను తీసుకువస్తారు.