: దీక్షల పేరిట నాటకాలాడకండి : మైసూరా రెడ్డి
తెలుగుదేశం పార్టీ నేతలు విద్యుత్ దీక్షల పేరిట నాటకాలాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచుతుంటే చోద్యం చూశారా? అని ఆయన టీడీపీ నేతలను ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీలు పెరిగాక గగ్గోలు పెడుతూ ఓట్లకోసం హంగామా చేస్తున్నారని విమర్శించారు.
ఈఆర్సీ ముందు టీడీపీ ఎందుకు అభ్యంతరాలు చెప్పలేదన్నారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటువేసి ఉంటే కిరణ్ సర్కారు ఉండేదికాదని ఆయన తెలిపారు. రిలయన్స్ సంస్థ రాష్ట్రానికి గ్యాస్ ఇచ్చి ఉంటే ఈ కరెంటు కోతలు తప్పేవని మైసూరా అభిప్రాయపడ్డారు.