: భార్య, కొడుకును కొట్టిన నేరానికి... 16 ఏళ్ల జైలుశిక్ష!


లండన్ లో నివసిస్తున్న ప్రవాస భారతీయుడు కట్టుకున్న భార్యను, కన్న కొడుకును కొట్టినందుకు కటకటాల పాలయ్యాడు. ఆ ఎన్నారైకి ఒకటి, రెండూ కాదు... ఏకంగా 16 ఏళ్లకు పైగా జైలు శిక్షను కోర్టు ఖరారు చేసింది. దక్షిణ యార్క్ షైర్ లోని బమ్ స్లే ప్రాంత వాసి అయిన అజిత్ శేఖన్ గతేడాది అక్టోబరులో తన భార్య మంజీత్ కౌర్ శేఖన్ (55), కుమారుడు పాల్ (31)పై దాడి చేశాడు.

ఇంతకీ ఇతగాడి కోపానికి కారణమేమిటో తెలుసా? భార్య, కొడుకులు టీవీ చూస్తున్నారని... అజిల్ పట్టరాని ఆగ్రహంతో, విచక్షణా రహితంగా దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరిచాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి... షిఫీల్డ్ క్రౌన్ కోర్టు ముందు నిలబెట్టారు. కేసును విచారించిన న్యాయమూర్తి కొడుకును కొట్టినందుకు తొమ్మిదేళ్లు, భార్యను దాడిచేసినందుకు 6 సంవత్సరాల 9 నెలలు జైలు శిక్ష విధించారు.

  • Loading...

More Telugu News