: ఆ ఫోన్ అమ్మకాలు మొదలైన కాసేపటికే స్టాక్ అయిపోయింది
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం విడుదలైన మోటో ఈ స్మార్ట్ ఫోన్ బెస్ట్ సెల్లర్ గా నిరూపించుకుంది. ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ ద్వారా నిన్న ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభించింది. స్మార్ట్ ఫోన్ తో పాటు బ్యాక్ కవర్స్, మెమొరీ కార్డ్ ను డిస్కౌంట్ తో అందజేసింది. దీనికి విశేష ఆదరణ లభించింది. మోటో ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకం ప్రారంభించిన కొద్ది సేపటికే స్టాక్ అయిపోయినట్టు వెబ్ సైట్ ప్రకటించింది.