: మా పాలనలో తప్పులు జరిగాయి: బొత్స
కాంగ్రెస్ పాలనలో పరిపాలన పరంగా కొన్ని తప్పులు జరిగాయని మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అంగీకరించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి టీడీపీ, లేదా వైఎస్సార్సీపీ రానున్నాయని అన్నారు. అధికారం చేపట్టనున్న రెండు పార్టీలు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారం సందర్భంగా టీడీపీ, వైఎస్సార్సీపీ ఇచ్చిన హామీలను చదివి వినిపించారు.