: ఎందరో భారతీయులు నల్లధన కుబేరులు?
విదేశాలలో అక్రమంగా పోగుబడిన భారతీయుల నల్లధనాన్ని తిరిగి రప్పించాలని దేశవ్యాప్తంగా కొంతకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై బీజేపీ ఎంతగా ఒత్తిడి చేస్తున్నప్పటికీ కేంద్రం అంటీ ముట్టనట్లుగానే ఉంటోంది. జర్నలిస్టుల అంతర్జాతీయ బృందం ఒకటి దీనిపైనే దర్యాప్తు జరిపి 612 మంది భారతీయులకు విదేశాలలో ఖాతాలున్నట్లు గుర్తించింది. అందులో కంపెనీల పేర్లూ ఉన్నాయి.
వీరిలో రాష్ట్రానికి చెందిన పెద్దపల్లి ఎంపీ జి.వివేక్, యూబీ గ్రూప్ అధినేత విజయ్ మాల్యా, ఎస్సార్ గ్రూప్ వైస్ చైర్మన్ రవి రూయా, మోడీ గ్రూప్ ఈడీ సమీర్ మోడీ, డాబర్ గ్రూప్ కు చెందిన చేతన్ బర్మన్, ఓస్వాల్ స్పిన్నింగ్స్ కంపెనీ అధినేత అభయ్ కుమార్ ఓస్వాల్, ఎంఆర్ఆఫ్ డైరెక్టర్ రాహుల్ మమ్మెన్, సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగరాజు కుమారుడు తేజరాజు, ఇండియా బుల్స్ గ్రూప్ వైస్ చైర్మన్ సౌరభ్ మిట్టల్ తదితరులు ఉన్నారు.
వాస్తవానికి నిబంధనల మేరకు ఏడాదికి కోటి రూపాయల వరకు నిధులను విదేశాలకు తరలించుకోవచ్చు. అదీ పన్నుకట్టిన ఆదాయానికి మాత్రమే అనుమతి ఉంటుంది. మరి ఏడాదికి కోటి చొప్పునే పరిమితి ఉంటే వీరంతా తక్కువ కాలంలోనే అన్నేసి కోట్లు(వందలు, వేలు) ఎలా పోగేశారన్నదే పెద్ద ప్రశ్న?