: అమెరికాలో ముగ్గురు తెలుగు యువకుల అదృశ్యం!
అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలోని ఫెయిర్ ఫ్యాక్స్ నగరంలో ఉండే మిత్రుడి ఇంటికి వెళ్లిన శరత్ సుదర్శనం, విఘ్నేష్ అశోకన్, మోకా మల్లికార్జున్ అనే ముగ్గురు తెలుగు యువకులు అదృశ్యమయ్యారు. వీరు అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలోని కాకీస్ విల్ నగరంలో వుంటున్నారు. మిత్రుడి ఇంటి నుంచి ఆదివారం రాత్రి 1.15 నిమిషాలకు బయల్దేరే సమయానికి వీరిలో ఇద్దరి ఫోన్లలో ఛార్జింగ్ అయిపోగా, ఒకరి ఫోన్ సోమవారం వరకు పని చేసిందని, అయితే ఆ ఫోన్ ను ఎవరూ అటెండ్ చేయలేదని విఘ్నేష్ బావ తెలిపారు.
ముగ్గురు యువకుల మిస్సింగ్ పై వర్జీనియా పోలీసుల వద్ద కేసు నమోదు చేశామని, వారి నుంచి సరైన స్పందన రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పలు స్థానిక, జాతీయ తెలుగు సంఘాలు వీరి ఆచూకీపై స్పందించాల్సిందిగా తమ సభ్యులకు సమాచారం అందించాయి.