: జైలులో ఉన్న భర్తను ఎంపీటీసీగా గెలిపించిన భార్య


జైలులో ఉన్న వ్యక్తి ఎంపీటీసీగా గెలుపొందాడు. ఆ గెలుపుకు కారణం అతని భార్య. ఒంటరిగా తన భర్త కోసం ప్రచారం నిర్వహించి 180 ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంది. కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం పెంచికల్‌పేట గ్రామానికి చెందిన తాళ్ల శంకర్ నాగారం ఎంపీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన నామినేషన్ వేసిన ఐదు రోజులకు, సింగరేణి నుంచి రామగుండం ఎన్‌టీపీసీకి వెళ్లే రైలు నుంచి బొగ్గు దొంగిలిస్తున్నాడని సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదు చేశారంటూ శంకర్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. తన భర్త అమాయకుడని, అతనిని కావాలని కొందరు జైల్లో పెట్టించారని అతని తరపున ఆయన భార్య ప్రచారం చేసింది.

  • Loading...

More Telugu News