: తెలంగాణ ఎంపీటీసీ ఫలితాలివే
తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నవీన్ మిట్టల్ ప్రకటించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో మొత్తం 6,525 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా, 6,467 స్థానాలకు ఫలితాలు వెల్లడించామన్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ 2,351, టీఆర్ఎస్ 1,860, టీడీపీ 1,061, బీజేపీ 275, సీపీఎం 145, వైఎస్సార్సీపీ 121, సీపీఐ 80 ఎంపీటీసీలను గెలుచుకున్నాయని తెలిపారు. బీఎస్పీ 28, లోక్ సత్తా ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయని చెప్పారు. ఇతర పార్టీలకు చెందిన వారు 23 స్థానాల్లో, స్వతంత్ర అభ్యర్థులు 500 స్థానాల్లో గెలుపొందారని వెల్లడించారు. మిగిలిన ఎంపీటీసీ స్థానాలకు రీపోలింగ్ నిర్వహించాల్సి ఉందన్నారు.