: తెలంగాణ జడ్పీటీసీ ఫలితాలివే


తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నవీన్ మిట్టల్ ప్రకటించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో 443 జెడ్పీటీసీ స్థానాలకు గాను 440 స్థానాల ఫలితాలను వెల్లడించామన్నారు. వీటిలో... టీఆర్ఎస్ 191, కాంగ్రెస్ 176, టీడీపీ 53, వైఎస్సార్సీపీ 6, బీజేపీ 4, సీపీఎం 2, సీపీఐ 2 స్థానాల్లో విజయం సాధించాయని తెలిపారు. స్వతంత్ర అభ్యర్థులు 5 స్థానాలను గెలుచుకోగా, బీఎస్పీ 1 స్థానంలో గెలుపొందిందని చెప్పారు.

  • Loading...

More Telugu News