: ఐఓసీకి పన్ను నోటీసులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు కేంద్ర ఎక్సైజ్ ఇంటెలిజెన్స్ శాఖ పన్ను నోటీసులు జారీ చేసింది. భారత దేశంలో అతిపెద్ద సంస్థ ఐఓసీ సరకుల రవాణా ఏజెన్సీ విభాగంలో చెల్లించాల్సిన సేవా పన్ను చెల్లించలేదని కేంద్ర ఎక్సైజ్ ఇంటెలిజెన్స్ శాఖ డైరెక్టర్ జనరల్ తెలిపారు. 4.6 కోట్ల రూపాయల పన్ను చెల్లింపుపై కంపెనీకి గత నెల షోకాజ్ నోటీసులు జారీ చేశామని, నోటీసులపై వివరణ ఇచ్చేందుకు మే 24 వరకు గడువు ఇచ్చామని ఆయన అన్నారు.