: వాద్రాకు లైసెన్సులపై మే 21న ఢిల్లీ హైకోర్టు విచారణ


హర్యానాలో స్థిరాస్తి వ్యాపారులకు మంజూరు చేసిన లైసెన్సులపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణను మే 21వ తేదీన చేపట్టనున్నట్లు ఢిల్లీ హైకోర్టు ఇవాళ తెలిపింది. హర్యానాలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి నిమిత్తం లైసెన్సులు పొందిన వారిలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కూడా ఉన్నట్లు ఈ పిల్ లో ఆరోపించారు. చీఫ్ జస్టిస్ రోహిణి, జస్టిస్ ఆర్ఎస్ ఎండ్లాతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ పిల్ ను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. హర్యానాలోని 21,366 ఎకరాల వ్యవసాయ భూమిని రెసిడెన్షియల్ కాలనీలుగా అభివృద్ధి చేసేందుకు నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ డెవలపర్లు, బిల్డర్లకు హర్యానా ప్రభుత్వం అనేక లైసెన్సులు మంజూరు చేసిందని న్యాయవాది ఎంఎల్ శర్మ తన పిల్ లో ఆరోపించారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర ఖజానాకు రూ.3.9 లక్షల కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News