: సైక్లోన్ దెబ్బకు జల్పాయ్ గురి విలవిల
సైక్లోన్ ప్రభావంతో భారీ వర్షాలు పశ్చిమబెంగాల్లోని జల్పాయ్ గురిని ముంచెత్తాయి. సుమారు 3,500 ఇళ్లకు నష్టం వాటిల్లింది. బలమైన గాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. జాతీయ రహదారిపై ట్రాఫిక్ కు అవాంతరాలు ఏర్పడ్డాయి. నదులు పొంగి ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.