: నెల్లూరు జిల్లాలో బ్యాలెట్ బాక్సులకు చెదలు


నెల్లూరు జిల్లా కావలిలోని జవహర్ భారతి కళాశాలలో భద్ర పరిచిన బ్యాలెట్ బాక్సులకు చెదలు పట్టాయి. ఇవి కొండాపురం మండలం పొత్తిపల్లి, గొట్టిపల్లి, ఇసుకదామర్ల, ఎర్రగుట్టపల్లి, ఎర్రవల్లి, మన్నంవారిపల్లి ఎంపీటీసీ స్థానాలకు చెందినవి. చెదలు కారణంగా బ్యాలెట్ పేపర్లు చిరిగిపోయి ఉండటంపై లెక్కించే సమయంలో ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్యాలెట్ పేపర్లకు చెదలు పట్టిన విషయాన్ని ఆర్టీవో కేవీ రమణారెడ్డి తెలుసుకుని జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై రిటర్నింగ్ అధికారి తుది నిర్ణయం తీసుకుంటారు.

  • Loading...

More Telugu News