: కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు, 53 మంది విద్యార్థులకు గాయాలు
జమ్మూ కాశ్మీర్లోని బిషానాహ్ ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు అదుపు తప్పి, పక్కనే ఉన్న కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో బస్సులోని 53 మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలను ప్రారంభించి, బస్సులోని 53 మంది విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విద్యార్థులను జమ్మూ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.