: డేర్ డెవిల్స్.. కష్టమే!
ఐపీఎల్ తొలి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడుతున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. టాపార్డర్ లో కెప్టెన్ జయవర్ధనే (66) ఒంటరి పోరాటం చేశాడు. వార్నర్ 21 పరుగులు చేశాడు. ఇక మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు. కోల్ కతా బౌలర్లు సొంత మైదానంలో చెలరేగిపోవడంతో ఢిల్లీ ఓ మోస్తరు స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది. మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ 4 ఓవర్లలో కేవలం 13 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీయడం విశేషం.