: బౌద్ధారామంలో పోలింగ్... ప్రార్థనలు రద్దు


కోల్ కతాలోని 117 ఏళ్ల నాటి బౌద్ధారామం కాస్తా ఇవాళ పోలింగ్ బూత్ గా మారిపోయింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే బౌద్ధారామంలో ఓటర్లు, ఎన్నికల అధికారులు, భద్రతా బలగాలతో హడావిడి నెలకొంది. బౌద్ధారామం ప్రాంగణంలోని చిన్న పాఠశాలలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. పోలింగ్ కారణంగా బౌద్ధ భిక్షువులు వారి రోజువారీ ప్రార్థనలను రద్దు చేసుకున్నారు.

"మేం రోజూ ఉదయం, సాయంత్రం ప్రార్థనలు చేస్తుంటాం. బౌద్ధారామంలో వాతావరణం ప్రార్థనలకు అనుకూలంగా లేని కారణంగా రద్దు చేసుకున్నాం" అని బోజజార్ లోని బౌద్ధారామం ప్రధాన కార్యదర్శి హిమేందు వికాస్ చౌదరి చెప్పారు. ఇతర ధార్మిక కార్యక్రమాలు కూడా రద్దు అయ్యాయని ఆయన తెలిపారు. బెంగాల్ బుద్ధిస్ట్ అసోసియేషన్ గా పేరొందిన బౌద్ధ ధర్మాంకర సభను కృపాశరన్ మహాస్థవీర్ 1892లో స్థాపించారు. ప్రస్తుతం దానికి షిల్లాంగ్, డార్జిలింగ్, లక్నో, సార్ నాథ్, రాజ్ గిర్ లో శాఖలున్నాయి.

ఇదిలా ఉండగా, మే 14న రీపోలింగ్ నిర్వహించేందుకు బౌద్ధరామాన్ని సిద్ధంగా ఉంచాలంటూ ఎన్నికల సంఘం ఇప్సటికే ఆదేశాలు జారీ చేసింది. మే 14న బౌద్ధ పౌర్ణమిని అక్కడ జరుపుకోవాల్సి ఉండగా, ఈసీ నిర్ణయంతో ఆ రోజు వేడుకలను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని బౌద్ధారామం అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News