: గుంటూరు, కృష్ణా జిల్లాల్లో టీడీపీ జోరు
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. గుంటూరు జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో తాడేపల్లి మినహా మిగిలిన అన్ని మున్సిపాలిటీల్లో టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. నరసరావుపేట, తెనాలి, బాపట్ల, రేపల్లె, చిలకలూరిపేట, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, వినుకొండలో టీడీపీ గెలుపొందింది. తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
కృష్ణాజిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లో టీడీపీ ఐదింటిలో విజయం సాధించింది. మచిలీపట్నం, పెడన, తిరువూరు, నందిగామ, ఉయ్యూరు మున్సిపాలిటీల్లో టీడీపీ గెలుపొందింది. నూజివీడు, గుడివాడ, జగ్గయ్యపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిపొందింది.