: మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయకేతనం: టీడీపీ నేత శ్రీనివాసులు


మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేయడంతో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కె.శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలోని కార్పొరేషన్, అన్ని మున్సిపాలిటీల్లో టీడీపీ విజయం సాధించడం ఆ పార్టీ చేసిన మంచి పనుల వల్లేనని ఆయన అన్నారు. హైదరాబాదులో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు నాయకత్వం ఈ రాష్ట్రానికి అత్యంత ఆవశ్యకమని ప్రజలు గుర్తించారని అన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవినీతి, అక్రమాలతో నిండిపోయిందని, టీడీపీ నీతివంతమైన రాజకీయాన్ని నమ్ముకుందని శ్రీనివాసులు చెప్పారు. ఇవన్నీ టీడీపీకి కలిసి వచ్చిన అంశాలని ఆయన అన్నారు. పట్టణ ప్రాంత ఓటర్లు టీడీపీవైపే ఉన్నారని, సీమాంధ్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు సీఎం కావాలని ప్రజలు గుర్తించారన్నారు. రేపు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News