: వీటికి వాటికి సంబంధం లేదు: ఎస్వీ మోహన్ రెడ్డి
మున్సిపల్ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధం లేదని వైఎస్సార్సీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో 120 సీట్లతో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలంటే కౌన్సిలర్ అభ్యర్థి ఎవరనేది చూస్తారని, అసెంబ్లీ అనేసరికి ముఖ్యమంత్రి ఎవరని చూస్తారని ఆయన తెలిపారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించి జగన్ సీఎం కావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.