: 'పాతాళంలో బొగ్గు, ఆకాశంలో విమానం.. కాదేదీ స్కాంకు అనర్హం'
టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి రొంపిలో కూరుకుపోయిందని విమర్శించారు. పాతాళంలో ఉన్న బొగ్గు నుంచి.. ఆకాశంలో ఉన్న విమానాల వరకు కాంగ్రెస్ నాయకులు అన్నింటా కుంభకోణాలకు తెగబడ్డారని కేటీఆర్ దుయ్యబట్టారు. యూపీఏ హయాంలో చోటు చేసుకున్న స్కాంలు దేశ చరిత్రలో మునుపెన్నడూ జరగలేదని ఆయన అన్నారు.
కేంద్ర మంత్రులు కటకటాలపాలైన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఇక తెలంగాణ అమరవీరులను కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ రేణుకా చౌదరిపై కేటీఆర్ మండి పడ్డారు. వారి గురించి మాట్లాడే అర్హత ఆమెకు లేదని ఆయన స్సష్టం చేశారు.