: కరీంనగర్ లో టీఆర్ఎస్ ఆధిక్యం
కరీంనగర్ జిల్లాలోని రెండు కార్పొరేషన్లలో ఒకదానిలో తెలంగాణ రాష్ట్ర సమితి, మరొకదానిలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ లో 50 స్థానాలకు టీఆర్ఎస్ 24 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ -13, టీడీపీ-1, ఇతరులు -12 స్థానాలు గెలుచుకున్నారు. ఇక రామగుండం కార్పొరేషన్ ఫలితాల్లో మొత్తం 50 స్థానాలకు 19 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. ఇక టీఆర్ఎస్-14, ఇతరులు -17 గెలుచుకున్నాయి.