: నిమ్మగడ్డ చుట్టూ 'ఐటీ' ఉచ్చు బిగుస్తోంది
జగన్ కు చెందిన 'జగతి' పబ్లికేషన్స్ లో ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులు పెట్టడం, ఇదంతా క్విడ్ ప్రోకో వ్యవహారమని భావించి సీబీఐ నిమ్మగడ్డను అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. జగతి పబ్లికేషన్స్ లో నిమ్మగడ్డ పెట్టుబడులపై తాజాగా ఆదాయపు పన్నుశాఖ దృష్టి సారించింది.
ఇందులో భాగంగా నెలన్నరలోపు జగతి పబ్లికేషన్స్ ఆదాయపన్ను మదింపు పూర్తి చేయాల్సి ఉందని అందుకుగాను వాన్ పిక్ అభియోగపత్రం, ఒప్పంద పత్రాలు, దస్త్రాలు ఇవ్వాలంటూ సీబీఐ కోర్టును ఇవాళ ఐటీ అధికారులు కోరారు. బదులుగా వాన్ పిక్ సంబంధిత పత్రాలు ఇచ్చేందుకు సీబీఐ కోర్టు అంగీకారం తెలిపింది.