: సంజయ్ దత్ కు చిరంజీవి బాసట
ప్రముఖ బాలీవుడ్ నటుడు.. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో 5ఏళ్లు శిక్షపడ్డ సంజయ్ దత్ కు టాలీవుడ్ నటుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి బాసటగా నిలిచారు. సంజయ్ కు క్షమాభిక్ష పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యక్తిగతంగా ఆయన ఇప్పటికే ఎంతో మనోవేదన అనుభవిస్తున్నారని, కుంగిపోయారని చిరు అన్నారు. తాను చేసిన తప్పుకు సంజయ్ ఎంతో విచారం, ఆవేదన పడుతున్నాడని చిరంజీవి అన్నారు.