: అతను అమెరికాలో జడ్జిని కొనేసి హైదరాబాద్ వచ్చేశాడు!


నిన్న హైదరాబాదులో పోలీసులు అరెస్టు చేసిన లివింగ్ స్టన్ భారత సంతతికి చెందిన అమెరికన్. ఇంకా చెప్పాలంటే, మన హైదరాబాదు మూలాలున్న వ్యక్తి. ఇరవయ్యేళ్ల క్రితం చిక్కడపల్లికి చెందిన ఓ డాక్టర్ కుటుంబం అమెరికాలో స్థిరపడిపోయింది. ఆ డాక్టర్ కుమారుడైన 'ముద్దమల్లె అమిత్ కుమార్' అలియాస్ 'లివింగ్ స్టన్' అలియాస్ 'సంజీవ్ కుమార్' (45) మెడికల్ ట్రాన్స్ క్రిప్షనిస్టుగా పని చేశాడు.

అతడికి అమెరికా పౌరసత్వం కూడా ఉంది. అక్కడే టీచర్ గా పని చేస్తున్న 'హెర్మీలియా హెర్నాండెజ్' అనే యువతిని ప్రేమించాడు. ఆమె పెళ్లికి నిరాకరించడంతో ఆమెను పాశవికంగా హత్య చేశాడు. దీనిపై కేమరూన్ కౌంటీ కోర్టులో విచారణ జరిగింది. మరో రెండు రోజుల్లో తుది తీర్పు వెలువడుతుందనగా జడ్జిని, అటార్నీ ని 20 లక్షల డాలర్లకు కొనేసిన లివింగ్ స్టన్, 60 రోజుల పెరోల్ పొందాడు.

వెంటనే అమెరికా వీడి హైదరాబాద్ వచ్చేశాడు. తీర్పు రోజు అతనికి 23 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. తీర్పు అమలు చేయడానికి పోలీసులు అతని ఇంటికి వెళ్లి, దేశం వీడాడని తెలుసుకుని అవాక్కయ్యారు. దీనిపై అమెరికా మీడియాలో పెద్దఎత్తున దుమారం రేగింది. దీంతో నిందితుడు దేశం ఎలా వీడాడంటూ దర్యాప్తు చేశారు. న్యాయమూర్తుల అవినీతిపై ఆధారాలు సంపాదించిన ఎఫ్ బీఐ అధికారులు వారు అవినీతికి పాల్పడినట్టు నిర్ధారించారు.

దీంతో లివింగ్ స్టన్ ను పట్టుకునేందుకు 2008లో ఇంటర్ పోల్ సాయంతో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. ఎట్టకేలకు కాప్రాలోని మాధవపురికాలనీలోని ఎస్ఎస్ ప్లాజా అపార్ట్ మెంట్ లో మకాం వేసిన లివింగ్ స్టన్ ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News