: యాదగిరి నరసింహుని జయంతి మహోత్సవాలు


భక్తుల ఆరాధ్యదైవం యాదగిరిగుట్ట శ్రీనరసింహస్వామి జయంత్యుత్సవాలు నేటి నుంచి ఘనంగా జరుగుతున్నాయి.
నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో కొలువైన నరసింహుడి జయంతి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలను విశ్వక్సేన పూజతో ప్రారంభిస్తారు.
సోమవారం లక్ష తులసి, పుష్పార్చన, మంగళవారం త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో గర్భాలయంలోని స్వయంభువులకు అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహిస్తారు.
ఆది, సోమవారాల్లో స్వామివారికి ప్రత్యేక అలంకార సేవోత్సవాలు కూడా జరుగుతాయని దేవస్థానం అధికారులు తెలిపారు.
ఈ వేడుకలకు భక్తులు విశేషంగా హాజరవుతారని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News